అయోధ్యలో 30 ఏళ్ల మౌన వ్రతాన్ని జై శ్రీరామ్ నినాదంతో విడిచిన మహిళ

by Mahesh |   ( Updated:2024-01-25 04:06:12.0  )
అయోధ్యలో 30 ఏళ్ల మౌన వ్రతాన్ని జై శ్రీరామ్ నినాదంతో విడిచిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రాముని ఆలయం నిర్మించాలన్నది హిందువుల చిరకాల వాంచ ఎట్టకేలకు నెరవేరింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు బాల రాముని దర్శనం కోసం భారీగా అక్కడకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఓ మహిళా అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తయ్యే వరకు ఎవరితో మాట్లాడకుండా దాదాపు 30 సంవత్సరాల నుంచి మౌనవ్రతం పాటిస్తూ వస్తుంది. ఎట్టకేలకు రామాలయం పూర్తి కావడంతో ఆమెను కుటుంబ సభ్యులు అయోధ్యకు తీసుకొచ్చారు.

దీంతో ఆమె తన 30 సంవత్సరాల మౌన వ్రతాన్ని జై శ్రీరామ్ నినాదంతో రాములోరి సన్నిధిలో విరమించారు. ఆ సమయంలో ఆ మహిళ జై శ్రీరామ్ నినాదం చేస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కాగా తన తల్లి కల అయోధ్య రామాలయంలో నెరవేరడంతో కుటుంబ సభ్యులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed