‘రామజన్మభూమి’ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకూ రామమందిర ఆహ్వానం

by Hajipasha |   ( Updated:2024-01-19 18:44:53.0  )
‘రామజన్మభూమి’ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకూ రామమందిర ఆహ్వానం
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘రామజన్మభూమి - బాబ్రీ మసీదు’ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనూ జనవరి 22న జరగబోయే రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొనాలని కోరుతూ రామమందిరం ట్రస్టు నుంచి ఆహ్వానలేఖను అందుకున్న ప్రముఖుల జాబితాలో వీరు కూడా ఉన్నారు. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో 2019 సంవత్సరంలో తీర్పును వెలువరించిన సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఉన్నారు. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో రంజన్ గొగోయ్ సహా మాజీ సీజేఐ ఎస్ఎ బాబ్డే, ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్.అబ్దుల్ నజీర్‌ ఉన్నారు. ఒక ట్రస్టు‌ను ఏర్పాటుచేసి వివాదాస్పద స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని, అయోధ్యలోనే మసీదు నిర్మించుకోవడానికి వేరే స్థలాన్ని ముస్లిం పక్షానికి కేటాయించాలని ధర్మాసనం అప్పట్లో సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాతే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రారంభమైంది.

Advertisement

Next Story

Most Viewed