నియంత్రిత పంటల సాగుతోనే గిట్టుబాటు: జగదీశ్‌రెడ్డి

by Shyam |
నియంత్రిత పంటల సాగుతోనే గిట్టుబాటు: జగదీశ్‌రెడ్డి
X

దిశ, నల్లగొండ: నియంత్రిత పంటల సాగుతోనే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని మంత్రి జగదీశ‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే లాభదాయక పంటలపై రైతాంగం దృష్టిసారించేలా నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నియంత్రిత పంటల సాగు సదస్సులో మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నదే సదస్సుల లక్ష్యమని, ఇందులో రైతులను భాగస్వామ్యం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. డిమాండ్ ఉన్నపంటలపై దృష్టి సారించినప్పుడే మనం ధర నిర్ణయించుకునే శక్తి వస్తుందన్నారు. రైతులు దళారుల చేతికి చిక్కకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్ నియంత్రిత సాగుపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story