- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్-19 కోసం ఫవిపిరవిర్.. ఓకే చెప్పిన కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషద తయారీ సంస్థ అవ్ర లేబొరేటరీస్ ప్రై. లి. శుభవార్త తెలిపింది. కొవిడ్ 19 కోసం ఫవిపిరవిర్ ఎపిఐ ని ఉత్పత్తి చేసి.. మార్కెట్‌లో విడుదల చేసేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ నుంచి అప్రువల్ వచ్చింది. అతి తక్కువ ఖర్చుతో.. అత్యంత సమర్థవంతంగా ఉత్పత్తి చేసేందుకు అవ్ర లేబోరేటరీస్.. సిప్లా, డా. యూసుఫ్ హెడీడగైన్‌లు కలిసి పనిచేయనున్నాయి. ఎన్నో జెనెరిక్ మందులను కలిసి తయారు చేసిన ఈ జౌషద సంస్థలు.. మరోసారి కరోనా వైరస్‌పై ఫవిపిరవిర్ ప్రాజెక్టును ఉమ్మడిగా చేస్తున్నాయి.
ఈ ప్రాజెక్టుపై అవ్రలేబోరేటరీస్ ఛైర్మన్ డా. ఎ.వి.రామా రావు మాట్లాడుతూ… సిప్లా, డా. యూసుఫ్, హెడీడగైన్‌లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. యాంటీ-కేన్సర్, యాంటీ హెచ్ఐవి/ఎయిడ్స్ వంటి ప్రాణాల్ని కాపాడే మందులను ఇదివరకే అందుబాటులోకి తెచ్చామని.. మరోసారి ఫవిపిరవిర్ కోసం కలిసి పనిచేస్తున్నామన్నారు.