- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Robotaxi : స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండా ‘సైబర్ క్యాబ్’.. రోబో ట్యాక్సీ వచ్చేసింది
దిశ, నేషనల్ బ్యూరో : ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఎట్టకేలకు ‘రోబో ట్యాక్సీ’ని విడుదల చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీలో ఉండే వార్నర్ బ్రోస్ స్టూడియోలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దీన్ని స్వయంగా ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. ఈ రోబో ట్యాక్సీ పేరు ‘సైబర్ క్యాబ్’. దీని లుక్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ‘‘సైబర్ క్యాబ్ అన్ని దిక్కులనూ స్పష్టంగా చూడగలదు. అది అస్సలు అలసిపోదు. దానిలో స్టీరింగ్ వీల్ కానీ, పెడల్స్ కానీ ఉండవు. వైర్ లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది’’ అని ఎలాన్ మస్క్ తెలిపారు.
2026 సంవత్సరంకల్లా సైబర్ క్యాబ్‌ల పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సైబర్ క్యాబ్ ధర రూ.25 లక్షలలోపే ఉంటుందని చెప్పారు. ‘‘మేం వార్నర్ బ్రోస్ స్టూడియోలో 20 సైబర్ క్యాబ్ రోబో ట్యాక్సీల ప్రొటోటైప్‌లను, అటానమస్‌గా నడిచే 50 టెస్లా కార్లను అందుబాటులో ఉంచాం. ఆసక్తి కలిగిన వాహన ప్రియులు వాటిని టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. ఇందుకోసం మేం 20 ఎకరాల స్థలాన్ని రిజర్వ్ చేశాం. వచ్చే ఏడాదికల్లా మా కంపెనీకి (టెస్లా) చెందిన మోడల్ 3, మోడల్ వై కార్లను కూడా అటానమస్ డ్రైవింగ్ ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని ఆయన చెప్పారు.