ఎంఎం శ్రీలేఖకు ఛాలెంజ్ విసిరిన చంద్రబోస్

by Shyam |
ఎంఎం శ్రీలేఖకు ఛాలెంజ్ విసిరిన చంద్రబోస్
X

దిశ, న్యూస్ బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి విసిరిన ఛాంలెంజ్ స్వీకరించి మణికొండలోని తన నివాసంలో ఆదివారం సినీ గేయ రచయిత చంద్రబోస్ మొక్కలు నాటారు.

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమమని చంద్రబోస్ అన్నారు. మన జీవితం, సమాజం, భవిష్యత్ పచ్చగా ఉండాలంటే పచ్చని చెట్లే మూలాధారం అన్నారు. అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్, ప్లేబ్యాక్ సింగర్ ఎంఎం శ్రీలేఖ, సినీ దర్శకులు మున్నా‌కు చంద్రబోస్ విసిరారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.

Advertisement

Next Story