సచిన్, కోహ్లీలో కామన్ పాయింట్ అదే: క్లార్క్

by Shiva |
సచిన్, కోహ్లీలో కామన్ పాయింట్ అదే: క్లార్క్
X

లిటిల్ మాస్టర్ సచిన్, టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్. సచిన్‌ను ఔట్ చేయడం అంత సులువు కాదన్నాడు. సచిన్ బ్యాటింగ్ టెక్నిక్ అత్యద్భుతంగా ఉంటుందని.. ఇక కోహ్లీ మూడు ఫార్మాట్లలో తనకు ఎవరూ సాటిలేరని నిరూపించుకున్నాడని క్లార్క్ అన్నాడు. ‘‘ నా కెరీర్‌లో చూసిన బ్యాట్స్‌మెన్‌లో సచిన్‌కు ఉన్న బ్యాటింగ్ టెక్నిక్ మరే ఆటగాడిలో చూడలేదు. సచిన్‌ను ఔట్ చేయాలంటే ఎప్పుడు పొరపాటు చేస్తాడని మేమంతా ఎదురు చూసేవాళ్లం. కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్‌వన్ బ్యాట్స్‌మెన్. సచిన్, కోహ్లీలో కామన్ పాయింట్ ఒకటుంది. ఇద్దరూ భారీ శతకాలు చేయడానికి ఇష్టపడతారు’’ అని క్లార్క్ ‘బిగ్ స్ట్పోర్ట్స్ బ్రేక్ ఫాస్ట్’ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా, సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో వంద శతాకాలు సాధించాడు. ఇక కోహ్లీ 70 శతకాలతో రెండో స్థానంలో నిలిచాడు.

Tags: michael clarke, sachin, kohli, cricket, common point

Advertisement

Next Story

Most Viewed