- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆకర్షిణీయ ధరలో కొత్త వేరియంట్ విడుదల చేసిన ‘ఆడి ఇండియా’!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ ‘ఆడి ఇండియా’ భారత మార్కెట్లో తన ఎంట్రీ లెవల్ ఆడి ఏ4 సెడాన్ ప్రీమియం కారును విడుదల చేసింది. రూ. 39.99 లక్షల(ఎక్స్‌షోరూమ్) ధరలో ఇది లభిస్తుందని, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఆడి ఏ4 ప్రీమియం, ప్రీమియం ప్లస్, టెక్నాలజీ ట్రిమ్‌లతో, ఐదు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. ఆడి ఏ4 ప్రీమియం రూ. 43.69 లక్షలు, ఏ4 టెక్నాలజీ రూ. 47.61 లక్షల ధరలో తీసుకొచ్చింది.
తాజాగా ఈ మోడల్‌లో ఎంట్రీ లెవల్ కారును లాంచ్ చేసింది. ఈ సరికొత్త వేరియంట్‌లో సన్‌రూఫ్, ఆడి సౌండ్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా, డ్రైవ్ సెలెక్ట్, ఆరు ఎయిర్‌బ్యాగులు, వైర్‌లెస్ ఛార్జింగ్ సహా అనేక అధునాత ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వివరించింది. పార్కింగ్ ఎయిడ్ ప్లస్, స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్, 10-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే లాంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
‘ప్రస్తుత ఏడాది జనవరిలో విడుదల ఏ4 మోడల్ కోసం భారత మార్కెట్లో వినియోగదారుల నుంచి మెరుగైన ఆదరణను చూశాము. ఇప్పటివరకు కంపెనీ నుంచి వచ్చిన అన్ని మోడళ్లలో దీనికి స్పందన ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా విడుదలైన ఈ మోడల్ ద్వారా మరింత మంది వినియోగదారులకు చేరువ కాగలమని’ ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ వెల్లడించారు.