షాకింగ్.. మరో మైనర్ బాలికపై అత్యాచారయత్నం..?

by Sridhar Babu |
Rape
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్‌ పరిధిలో మైనర్‌పై అత్యాచారయత్నం ఘటన వెలుగుచూసింది. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు మైనర్‌ను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే, వైద్య పరీక్షల తరువాతే ఈ వ్యవహారంపై పోలీసులు నిర్ధారణకు రానున్నారు. పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు.. మైనర్ బాలిక తల్లి పొరుగు ఇంటికి వెళ్లిన క్రమంలో 18 ఏళ్ల యువకుడు ఇంట్లోకి చొరబడ్డట్టు తెలిపారు. మైనర్ పై అత్యాచారానికి యత్నిస్తున్న క్రమంలో.. తల్లి ఇంటికి చేరుకోవడంతో విషయాన్ని గమనించి పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed