- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికల్ షాప్‌నకు వెళ్లిన యువతిని టెస్ట్ చేస్తానని లోపలికి తీసుకెళ్లి..
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు ఎక్కడకు పోయినా కామాంధులు బెడద తప్పడం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి వచ్చే వరకు ఎవరో ఒకరు వేధిస్తూనే ఉంటున్నారు. తాజాగా అనారోగ్యానికి గురైన ఓ యువతి స్థానిక మెడికల్ షాప్‌నకు వెళ్తే.. ఆమెను లైంగికంగా వేధించాడు ఆ కీచక షాప్ ఓనర్. మందులు ఇవ్వమంటే.. టెస్ట్ చేస్తానని లోపలికి తీసుకెళ్లి అసభ్యంగా తాకుతూ పైశాచికంగా ప్రవర్తించాడు.
హైదరాబాద్‌లోని మోండా మార్కెట్ సమీపంలో సందీప్ యాదవ్(42) గోకుల్ మెడికల్ షాప్ నడిపిస్తున్నాడు. అదే మెడికల్ హాల్‌లో వెనకవైపు క్లినిక్‌లా ఓ రూం ఏర్పాటు చేసి, అనారోగ్యం, అస్వస్థతకు గురైన వారిని పరీక్షించి మెడిసిన్ ఇస్తుంటాడు. ఇదే క్రమంలో ఆ మెడికల్ షాప్‌నకు ఓ యువతి జ్వరం, కడుపు నొప్పితో బాధపడుతూ మెడిసిన్ కోసం వెళ్లింది. అయితే టెస్ట్ చేశాకే మందులు ఇస్తానని ఆ యువతిని క్లినిక్‌లోకి తీసుకెళ్లాడు.
యువతిని బెడ్‌పై పడుకోబెట్టిన సందీప్ యాదవ్.. ఆమెను పరీక్షిస్తున్నట్లు నటిస్తూ ప్రైవేట్ పార్ట్స్ వద్ద అసభ్యంగా తాకతూ వికృతంగా ప్రవర్తించాడు. ఆ చర్యలతో షాక్ తిన్న యువతి.. అతడిని నెట్టేసి బయటకు పరుగులు పెట్టింది. ఇంటికి వెళ్లి రోధిస్తూ కుటుంబ సభ్యులకు మెడికల్ షాప్‌లో జరిగిన దుశ్చర్యను వివరించింది. వెంటనే తల్లిదండ్రులు ఆ యువతితో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సందీప్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అతడు క్లినిక్ ఎలా నిర్వహిస్తున్నాడని పరిశీలించగా.. కలకత్తా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా లభ్యమైంది. అయితే.. ఆ పట్టా అసలైందేనా లేక నకిలీదా అని పోలీసులు విచారిస్తున్నారు.