- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేసీఆర్‌కు ఊహించని షాక్.. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం
by Anukaran |

X
దిశ, జడ్చర్ల : తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలంటూ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను జడ్చర్లలో బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివరాల ప్రకారం.. గురువారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తండ్రి దశ దినకర్మకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గాన బయలుదేరారు.
ఈ క్రమంలో జడ్చర్ల మీదుగా గద్వాల వెళ్తుండగా జడ్చర్ల ఫ్లై ఓవర్ సమీపంలో జాతీయ రహదారిపై బీజేవైఎం నాయకులు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో పోలీసులు బీజేవైఎం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Next Story