జడ్చర్లలో ఏటీఎం చోరీకి యత్నం 

by Shyam |
జడ్చర్లలో ఏటీఎం చోరీకి యత్నం 
X

దిశ, మహబూబ్‌నగర్: ఏటీఎంలో నగదును ఎత్తుకెళ్లెందుకు దుండగులు విఫలయత్నం చేశారు. ఈ ఘటన జడ్చర్ల మండల కేంద్రం‌లోని పాత బస్టాండ్ సమీంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం నగదు విత్ డ్రా కోసం వెళ్లిన వారు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్నిపరిశీలించిన పోలీసులు ఏటీఎం సెంటర్ అద్దాలను ధ్వంసం చేసి లోపలికి వచ్చారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags: atm, robbery, Jadcherla, crime, ts news

Advertisement

Next Story