భూ వివాదంలో వాచ్‌మెన్‌పై దాడి

by Sumithra |   ( Updated:2020-07-01 10:03:14.0  )
భూ వివాదంలో వాచ్‌మెన్‌పై దాడి
X

దిశ, క్రైమ్‌బ్యూరో: అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ భూ వివాదంలో కొందరు వ్యక్తులు వాచ్‌మెన్‌పై దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటనపై యాజమాని నిమ్మ మోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్ గ్రామంలోని 573 సర్వేనెంబర్‌లో 3.24ఎకరాల స్థలంలో 2003 నుంచి నిమ్మ మోహన్‌రెడ్డి ఉంటున్నాడు. ప్రస్తుతం ఈ విషయంపై వివాదం కొనసాగుతుండగా, మేడ్చల్ 23వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం ఫిర్యాదుదారుడు మోహన్‌రెడ్డికి ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఈ స్థలం తనదేనంటూ ఎం.జనార్థన్‌రెడ్డి కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా కేసు విచారణలో ఉంది. అయితే, ఈ స్థలంపై మోహన్‌రెడ్డికి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ, జనార్థన్‌రెడ్డి, సుభాష్ చందర్ గౌడ్, తోట దేవేందర్‌రెడ్డి, తోట కృష్ణారెడ్డిలు మంగళవారం రాత్రి దాడి చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ యాదగిరి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed