ఉస్మానియా ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్‌పై దాడి

by Shyam |
ఉస్మానియా ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్‌పై దాడి
X

దిశ, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో సిబ్బందిపై దాడి జరగడంతో కలకలం రేగింది. పాతబస్తీ కాలపత్తర్‌కు చెందిన ఓ వృద్ధురాలి(70)కి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో శనివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్య సేవలు అందించినా పరిస్థితి విషమించడంతో ఉదయం 8గంటల సమయంలో వృద్ధురాలు చనిపోయింది. దీంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యుడు ఈసీజీ టెక్నిషియన్‌పై దాడి చేసి పరారయ్యాడు. వైద్యులు, సిబ్బందిని బూతులు తిట్టుకుంటూ సెక్యూరిటీ సిబ్బంది ఆపినా నెట్టేసుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో ఆస్పత్రిలో గందరగోళం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న అప్జల్‌గంజ్ ఎస్సై పీజీరెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకొని వివరాలు సేకరించారు. బాధిత సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed