- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్పంచ్‌ను సస్పెండ్ చేసిన అధికారులు.. ఎందుకంటే ?
దిశ, పరకాల: గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎస్‌ఎఫ్‌సీ, ఎఫ్ఎఫ్‌సీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగంతో ఆత్మకూర్ సర్పంచ్ పర్వతగిరి రాజును హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు గ్రామంలో పాత ట్యూబ్ లైట్స్ స్థానంలో పలుమార్లు కొత్త ఎల్ ఈడీ లైట్లు 13,15,944 రూపాయలతో 60,02,974 రూపాయలతో గ్రావెల్ తదితర పనులతో పాటు, సాధారణ నిధులు నుంచి సిబ్బంది జీతాల విషయాలలో అక్రమాలకు పాల్పడినట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు వార్డు సభ్యులు అక్టోబర్ 12వ తేదీన జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
అట్టి ఫిర్యాదును విచారించిన జిల్లా పంచాయతీ అధికారులు సర్పంచ్‌ను వివరణ కోరుతూ నవంబర్ 24వ తేదీన నోటీసులు జారీ చేయడం జరిగింది. సర్పంచ్ రాజు ఈనెల 1వ తేదీన ఇచ్చిన వివరణ ఆమోదయోగ్యంగా లేకపోవడంతో నూతన పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారంగా గ్రామపంచాయతీ తీర్మానం, బడ్జెట్ ఆమోదం లేకుండా ఇష్టానుసారంగా నిధులను ఖర్చు చేసినందుకుగాను ఈనెల 8వ తేదీ నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తప్ప ఏ విధమైన అధికారాలు ఉండవు. ఉత్తర్వులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సర్పంచి 30 రోజుల కాలవ్యవధిలోగ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ ను సంప్రదించాల్సి ఉంటుంది.