హద్దుల్లేని ప్రేమకు అక్షర రూపమిచ్చిన డైరెక్టర్ కపుల్

by Shyam |
హద్దుల్లేని ప్రేమకు అక్షర రూపమిచ్చిన డైరెక్టర్ కపుల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దంపతులు నేడు ఏడో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన వైఫ్ ప్రియా మోహన్‌‌కు సంబంధించిన బ్యూటిఫుల్ త్రో బ్యాక్ వీడియోను షేర్ చేసిన అట్లీ.. ‘లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుపై స్పందించిన ప్రియ.. ప్రతీ అమ్మాయి కలలుగనే మంచి భర్త, స్నేహితుడిలా ఉంటున్నందుకు అట్లీకి థాంక్స్ చెప్తూ జంటగా ఉన్న ఫొటోలు షేర్ చేసింది. కాగా 2014లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ అంతకుముందు ఎనిమిదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో తమ ప్రేమపూర్వక పోస్టులతో హృదయాలను గెలుచుకునే కపుల్.. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఇళయ దళపతి విజయ్‌తో వరుస సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్‌గా మారిన అట్లీ.. ప్రస్తుతం షారుఖ్‌, నయనతార కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story