- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత రన్నింగ్ కోచ్ హఠాన్మరణం
దిశ వెబ్‌డెస్క్: భారత రన్నింగ్ కోచ్ నికోలై స్నెసారెవ్ హఠాన్మరణం చెందారు. పంజాబ్‌లో గల నేషనల్ ఇన్‌స్టిబ్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లోని హాస్టల్ గదిలో మృతి చెందారు. ఆయన చనిపోవడానికి కారణాలు ఏంటనేది ఇంకా బయటపడలేదు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు విషయాలు బయటపడనున్నాయి. ఇండియన్ గ్రాండ్ ప్రి 3కి బెంగళూరు బేస్ నుంచి ఆయన రాగా.. మీటింగ్‌కు ఆయన రాలేదు. దీంతో తోటి కోచ్‌లకు అనుమానం వచ్చి ఆయన ఉంటున్న హాస్టల్ గది తలుపులు కొట్టారు.
ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో.. బద్దలు కొట్టి చూడగా స్నెసారెవ్ మంచంపై పడిపోయి ఉన్నారు. ఆయన కాళ్లకు షూస్ కూడా ఉన్నాయి. ఎంతోమంది ఛాంపియన్స్‌కు ఆయన శిక్షణ ఇచ్చారు.
స్నెసారెవ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజుతో పాటు పీటీ ఉష ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. 2005లో భారత్ రన్నింగ్ కోచ్‌గా ఆయన ప్రమాణం మొదలైంది. ఆయన దగ్గర శిక్షణ పొందిన ఎంతోమంది క్రీడాకారులు పలు టోర్నమెంట్లలో గోల్డ్ మెడల్స్ సాధించారు.