- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అద్భుత ముహూర్తాన.. ఐదు భాషల్లో!
దిశ, వెబ్‌డెస్క్: అద్భుత ముహూర్తాన.. అమృత ఘడియల్లో.. ‘వైకుంఠ ఏకాదశి రోజున..’ అనే చిత్రాన్ని చిన్ని కృష్ణ నిర్మిస్తున్నారు. చిన్నికృష్ణ స్టూడియోస్ సమర్పణలో బిల్వా క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న చిన్నికృష్ణ ఆఫీసులో ఆయన కుమార్తె ఆకుల ఊర్మిళాదేవి.. జ్యోతి ప్రజ్వలన చేయడం ద్వారా ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు.
ఐదు భాషల్లో ఏక కాలంలో రూపొందనున్న ఈ చిత్రానికి ముగ్గురు దర్శకులు పనిచేయనుండటం విశేషం. అంతేకాకుండా.. తెలుగు-కన్నడ వెర్షన్లలో ఒక హీరో హీరోయిన్ల జంట, తమిళ-మలయాళం వెర్షన్లలో ఇంకో హీరో హీరోయిన్ల జంట, హిందీ వెర్షన్‌లో మరో హీరో హీరోయిన్ల జంట నటించనుండటం గమనార్హం. అలాగే.. తెలుగు-కన్నడ వెర్షన్లకు ఒక దర్శకుడు, తమిళ-మలయాళం వెర్షన్లకు ఒక దర్శకుడు, హిందీ వెర్షన్‌కు ఒక దర్శకుడు పనిచేయనున్నారు. దర్శకులు, హీరోహీరోయిన్ల పేర్లను కూడా త్వరలో ఖరారు చేయనున్నట్లు చిన్ని కృష్ణ తెలిపారు.
ఫస్టాఫ్ గోవాలో, సెకండాఫ్ కాశీలో కథ జరుగుతుందనీ, ఈ కథ ఐదేళ్ల కష్టానికి ఫలితం అని చిన్నికృష్ణ తెలిపారు. కథను సమకూర్చడంతో పాటు, స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా ఆయనే రాస్తున్నారు. ఇంతవరకూ తెలుగుతెరపై కనిపించని సన్నివేశాలు, వినిపించని సంభాషణలు ఈ చిత్రంలో చూస్తారని ఆయన చెప్పారు. ఎవరూ ఇలాంటి సబ్జెక్ట్‌ను ఇంతవరకూ సృష్టించలేదని ఆయన ఆసక్తి రేకేత్తించారు.