పట్టాలపై పడిపోయిన బాలుడు ..కాపాడిన పోలీసు

by Sumithra |   ( Updated:2021-03-10 23:52:37.0  )
పట్టాలపై పడిపోయిన బాలుడు ..కాపాడిన పోలీసు
X

దిశ,వెబ్ డెస్క్: బేగంపేట రైల్వేస్టేషన్ లో ఓ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి బాలుడి ప్రాణాన్ని కాపాడింది. నాంపల్లి నుంచి హుబ్లీ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు సాయంత్ర 4.7 గంటలకు బేగంపేట రైల్వేస్టేషన్ రెండో ప్లాట్ ఫాం దగ్గరకు వచ్చింది. అయితే ఈ సమయంలో తల్లి చేయి పట్టుకుని బాలుడు రైలు ఎక్కబోతుండగా జారి ప్లాట్ ఫాం రైలు పట్టాల మధ్య పడిపోయాడు. ఇంక కొద్ది సేపయితే రైలు కదల బోతుంది దీంతో తల్లి షబానా బేగం ఆందోలనకు గురైంది. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బాలుడు చేయిపట్టుకోని పైకి లాగాడు దీంతో బాలుడి తల్లి, అక్కడ ఉన్న స్థానికిలు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story