- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, ఫీచర్స్: యుగాలుగా రోగ్ గ్రహాలు ఖగోళ శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి. ఈ ఫ్రీ-ఫ్లోటింగ్ ప్లానెట్స్(FFPs).. నక్షత్రాల చుట్టూ తిరిగే సాధారణ గ్రహాల మాదిరి కాకుండా గెలాక్సీలో తిరుగుతాయి. ఎటువంటి కక్ష్య మార్గం లేకుండా అంతరిక్షంలో తేలుతుంటాయి. కాగా అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం తాజాగా ‘రోగ్ ప్లానెట్స్(మోసపూరిత గ్రహాలు)కు సంబంధించిన అతిపెద్ద సమూహాన్ని కనుగొంది. స్కార్పియస్, ఓఫియుచస్ రాశులలో ఉన్న నక్షత్రాలు ఏర్పడే ప్రాంతంలో రోగ్ గ్రహాలను పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విశేషాలు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి.
దశాబ్దం కిందటే నాసాకు చెందిన కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్ ‘ఫ్రీ-ఫ్లోటింగ్’ గ్రహ వస్తువును కనుగొంది. అయితే రోగ్ గ్రహాల సంఖ్యను కచ్చితంగా గుర్తించడం చాలా కష్టం. ఆ సంఖ్య ఇప్పటికే తెలిసిన రోగ్ గ్రహాల కంటే రెట్టింపు ఉంటుందని ప్రస్తుత అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 80,000 వైడ్-ఫీల్డ్ చిత్రాలతో పాటు అనేక భూ-ఆధారిత, అంతరిక్ష టెలిస్కోప్‌ల ద్వారా 20 ఏళ్ల పరిశీలనల నుంచి పొందుపరిచిన డేటాను శాస్త్రవేత్తల బృందం ఈ కొత్త అధ్యయనం కోసం ఉపయోగించింది. మైక్రోలెన్సింగ్, డైరెక్ట్ ఇమేజింగ్ సాంకేతికతతో పాటు ప్లానెట్-ప్లానెట్ స్కాటరింగ్ సిమ్యులేషన్స్ ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇందు కోసం టెలిస్కోప్స్‌లో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ESO), విజిబుల్ అండ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్ ఫర్ ఆస్ట్రానమీ (VISTA), VLT సర్వే టెలిస్కోప్ (VST)తో పాటు చిలీలో ఉన్న MPG/ ESO 2.2-మీటర్ టెలిస్కోప్ కూడా ఉపయోగించారు.
ఒక నక్షత్రం ఏర్పడే ప్రాంతంలోనే మేము 100-170 ఫ్రీ-ఫ్లోటింగ్ ప్లానెట్స్ గుర్తించాం. ఇది ఇప్పటివరకు తెలిసిన రోగ్ గ్రహాల మొత్తం నమూనాను రెట్టింపు చేస్తుంది. ఆతిథ్య నక్షత్రం లేకుండా పాలపుంతలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఫ్రీ ఫ్లోటింగ్ జెయింట్ ప్లానెట్స్ అనేక బిలియన్లు ఉండవచ్చు. రోగ్ గ్రహాలను అధ్యయనం చేయడం ద్వారా రోదసీలోని నిగూఢ వస్తువులు ఎలా ఏర్పడ్డాయనే అంశంలో ఆధారాలు కనుగొనే అవకాశముంది. రోగ్ వరల్డ్‌ను పూర్తిగా డీకోడ్ చేసిన తర్వాత నిజానికి మన గెలాక్సీ ఎంత పెద్దదనే విషయం తెలుస్తుంది.
– సీన్ ఎన్. రేమండ్, సైంటిస్ట్, అధ్యయన రచయిత