ఎవరు మీలో కోటీశ్వరుడులో ‘ఆసిఫాబాద్ వాసి’..

by Sridhar Babu |   ( Updated:2023-09-09 14:00:18.0  )
ఎవరు మీలో కోటీశ్వరుడులో ‘ఆసిఫాబాద్ వాసి’..
X

దిశ, ఆసిఫాబాద్ : బుల్లితెర రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు. రెబ్బెన మండలానికి చెందిన సన్నీ అనే యువకుడు ఎవరు మీలో కోటీశ్వరుడు కాంటెస్ట్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. సన్నీ తండ్రి మాజీ ఆర్మీ జవాన్. ఇతను ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రవేటు కళాశాలలో ఐఐటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. జెమిని టీవీలో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ షోలో ఆసిఫాబాద్ వాసి పాల్గొననుండటంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed