- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏషియన్ పెయింట్స్ నికర లాభం రూ. 852 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ అతిపెద్ద పెయింట్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ నికర లాభం 1.15 శాతం వృద్ధితో రూ. 851.90 కోట్లుగా నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 5.37 శాతం పెరిగి రూ. 5,432.86 కోట్లకు చేరుకుంది. ‘డిమాండ్ స్థాయిలో కంపెనీ వ్యాపార విభాగాలు మెరుగుపడ్డాయని’ ఏషియన్ పెయింట్ ఎండీ, సీఈవో అమిత్ సింగల్ చెప్పారు.
భారత్‌లోని ఇతర వ్యాపార విభాగాలు దశలవారీగా తిరిగి ప్రారంభించేందుకు వీలుగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో మెరుగైన ఉత్పత్తి, స్థిరమైన ముడి పదార్థాల ధరలు, అనుకూలమైన విదేశీ మారకం రేటు, సంస్థ వ్యయ నియంత్రణ కారణంగా మెరుగిన ఫలితాలను సాధించామని ఆయన పేర్కొన్నారు. ఇక, ఈ ఏడాది సగానికి సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ఆదాయం 18.5 శాతం తగ్గి రూ. 10,155.38 కోట్ల నుంచి రూ. 8,272.89 కోట్లకు చేరుకుంది. సంస్థ ప్రతి షేర్‌కు రూ. 3.35 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.