- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలి..'

దిశ, మహేశ్వరం : మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు ఆదివారం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. మహేశ్వరం మండలం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఫ్యూచర్ సిటీలో కలిపేందుకు ప్రయత్నిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానాన్ని జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు.
ప్రజల ఆకాంక్ష, అఖిలపక్ష నాయకుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపి ప్రజలకు న్యాయం చేయాలని అఖిలపక్ష నాయకులు మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ కమిటీ చైర్మన్ వత్తుల రఘుపతి, మనోహర్, మల్లేష్ యాదవ్, దత్తు నాయక్, కాకి ఈశ్వర్, యాదిష్, పొతర్ల సుదర్శన్ యాదవ్, వర్కల యాదగిరి గౌడ్, కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్, రవి, పలువురు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.