మరోసారి వర్మ అరాచకం.. అమ్మాయిల తొడల పిచ్చి ఏంటయ్యా.. నీకు?

by Anukaran |   ( Updated:2021-08-28 05:04:32.0  )
మరోసారి వర్మ అరాచకం.. అమ్మాయిల తొడల పిచ్చి ఏంటయ్యా.. నీకు?
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య యాంకర్లను సెలబ్రెటీలను చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ కు భారీ హిట్స్ ని ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్లను పాపులర్ చేస్తూ, వివాదాలను కొనసాగిస్తూ జీవితం గడుపుతున్నాడు. ఇటీవలే బర్త్ డే వేడుకలో ఇష్టానుసారంగా తాగి నటీమణులు సుల్తానా- జ్యోతిలతో అసభ్యంగా డాన్స్ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత తన ఫస్ట్ లవ్ అంటూ ఒక మహిళా బికినీ ఫొటోలతో నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ విషయాలన్నీ మరువకముందే మరోసారి నెటిజన్లపై వర్మ విరుచుకుపడ్డాడు. మొన్నామధ్య అషూ రెడ్డి త‌న‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి రాగా, త‌న‌ని వింత యాంగిల్‌లో ఫొటో తీసి రచ్చ చేసిన వర్మ తాజాగా ఆ ఫోటోలను షేర్ చేశాడు.

బిగ్ బాస్’ ఫేమ్ అషూ రెడ్డి ఇటీవల వర్మ తో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన విషయం తెలిసిందే. ‘ఆర్జీవీ విత్ అరియనా’ లా ‘అషూ బోల్డ్ ఆర్జీవీ’ అని ఈమె కూడా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది, ఇక ఇంటర్వ్యూ కి వెళ్లిన అషూను వర్మ వింత వింత యాంగిల్ లో ఫోటోలు తీసాడు. టేబుల్ కింద నుంచి అషూ తొడలు కనిపించేలా ఫోటోలు తీస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వర్మ ఆ ఫోటోలను షేర్ చేశాడు. అంతేకాకుండా ఆ ఫొటోలకు ఓ వెరైటీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

“అషూ రెడ్డి అంటే ఈమేనా? ఈ ఫోటో తీసింది ఎవరో మీకుతెలుసా? తెలిస్తే దయచేసి వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడి’ అని పోస్ట్ చేశాడు. ఈ ఫోటోపై నెటిజన్స్ స్పందిస్తూ ఆ యాంగిల్ లో కెమెరా ఎలా పెట్టావని? వర్మా నీకు ఆ తొడల ఫాంటసీ ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫొటోలో అషూ రెడ్డి బ్లూ కలర్ పొట్టి దుస్తుల్లో అమ్మడి తొడ అందాలు అందర్నీ షాక్ కి గురిచేస్తున్నాయి. కొంచెం ఎబెట్టుగా ఉన్నా ఈ ఫోటోపై అషూ స్పందిస్తూ ఫోటో బావుంది.. ఫిల్టర్ యాడ్ చేస్తే ఇంకా బావుండేది అంటూ కామెంట్ పెట్టింది. ఇక దీంతో నెటిజన్లు మండిపడ్డారు. అసలు చూడకూడని ప్రదేశాన్ని చూపించాడు అనే బాధ లేకుండా ఫిల్టర్ యాడ్ చేయమంటావా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

Advertisement

Next Story