సచివాలయ ఉద్యోగులపై అశోక్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2020-02-20 07:28:44.0  )
సచివాలయ ఉద్యోగులపై అశోక్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు
X

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నేతగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు సచివాలయ ఉద్యోగులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఉద్యోగ సంఘాల్లో చర్చనీయాంశమైంది. శాసనమండలి ఛైర్మన్, శాసనసభ కార్యదర్శి మధ్య లేఖల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. శాసనసభ కార్యదర్శికి ఏపీ సచివాలయ ఉద్యోగులు మద్దతు పలికారు. దీంతో ఉద్యోగులపై అశోక్‌బాబుకి కోపం ముంచుకొచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు మితమీరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

శాసన మండలి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని అశోక్‌బాబుతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. ఛైర్మన్ కార్యదర్శి మధ్య నిబంధనల విషయంలో ఉద్యోగులకేంటి సంబంధం అని వారు ప్రశ్నించారు. సీఎం భక్తి చూపించాలనుకుంటే.. ఆయన ఇంటి ముందు చెక్క భజన చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. శాసన మండలి సంగతి పక్కన పెట్టి ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి రాజధానిలో 4 వేల ఎకరాలు సేకరిస్తామనడం దుర్మార్గమని వారిద్దరూ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed