- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ నిరాశే… ఆసరా కొత్త పెన్షన్లు లేనట్లే!
దిశ, తెలంగాణ బ్యూరో: ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. 57 ఏండ్ల వారే కాకుండా.. 65 ఏండ్లు పైబడిన వాళ్లంతా ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. కొత్త పెన్షన్ల అమలును వాయిదాల మీద వాయిదా వేస్తున్నారు. 65 ఏండ్ల వాళ్లకే కాదు.. 57 ఏండ్లు నిండినోళ్లకు కూడా ఆసరా పెన్షన్లు ఇస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఏడాదిలో వారికి పెన్షన్లు వచ్చే అవకాశం లేనట్టే. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి, ఆన్లైన్లో సబ్మిట్ చేయగా.. వీటికి నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కొర్రీలు పెట్టింది. ప్రస్తుతం పెండింగ్ అంటూ అనుమతి నిరాకరించింది. సీఎం నుంచి ఆదేశాలు వస్తేనే.. ఈ ఫైల్ క్లియర్ కానుంది. ఇటీవల తీసుకున్న కొత్త దరఖాస్తులు కాకుండా.. గతంలో అర్హత పొందిన 6.80 లక్షల మందికి కూడా పెన్షన్లు మంజూరు చేయడం లేదు.
ఆన్లైన్లో అప్రూవల్
వాస్తవానికి 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలప్పుడు 57 ఏండ్లు నిండిన అర్హులను గుర్తిస్తున్నట్లు గ్రామాల్లో ప్రభుత్వం హడావుడి చేసింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్టు ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 6.70 లక్షల మంది అర్హులు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పాత దరఖాస్తులు కాకుండా.. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 31 వరకు మరోసారి మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్లు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 57 ఏండ్లు నిండినోళ్లు సుమారు 9.50 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అప్లికేషన్ గడువు ముగిసిన తర్వాత వెరిఫికేషన్ చేయకున్నా.. కొన్నింటిని స్థానికంగా గుర్తించామంటూ అధికారులు ఆన్లైన్లో ఓకే చెప్పారు.
వాస్తవానికి 2018 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదు. 2018 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు వితంతులు, ప్రమాదాల కారణంగా దివ్యాంగులుగా మారినోళ్లు, బోదకాలు బాధితులు, 50 ఏండ్లు నిండిన గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, 65 ఏండ్లు నిండిన వృద్ధులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీరికి మంజూరు ఇవ్వకపోవడంతో పెన్షన్ రావడం లేదు. వీళ్ల నుంచి పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీవోలు అప్లికేషన్లు తీసుకుని, అర్హులను గుర్తించి ఎప్పటికప్పుడు ఎంపీడీవో లాగిన్ లో అప్లోడ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేటగిరీలకు చెందినవారి అప్లికేషన్లు ప్రతి నెలా సగటున 10 వేల వరకు వస్తున్నాయి. ఇలాంటి అప్లికేషన్లు మూడేండ్ల కాలంలో మూడు లక్షల వరకు వచ్చాయి. ఆన్లైన్లో ఈ అప్లికేషన్లు అప్రూవ్డ్‌గా చూపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో శాంక్షన్ చేయడం లేదు.
కొత్త వాటికి నో క్లియరెన్స్
ఈ ఏడాది ఆగస్టు నుంచే ఆసరా కొత్త పెన్షన్లు ఇస్తామంటూ జులైలో సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆగస్టు నెలలో ఆసరా ఓల్డేజ్ పెన్షన్ అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గిస్తూ సర్కార్ నుంచి ఉత్తర్వులు మాత్రమే వెలువడ్డాయి. పాత దరఖాస్తులు కాకుండా.. ఆగస్టులో దరఖాస్తులు తీసుకోవడంతో దాదాపు 4 లక్షలు కొత్తగా వచ్చాయి. కానీ ఈ అప్లికేషన్ల వెరిఫికేషన్నే ఇప్పటివరకు ప్రారంభించలేదు. కనీసం ఏ శాఖ అధికారులు వెరిఫికేషన్ చేయాలనే విషయంపైనా ఆదేశాలు రాలేదు.
మరోవైపు మూడేండ్లలో 2.50 లక్షల పెన్షన్లను తొలిగించినట్లు అధికారులు చెప్పుతున్నారు. అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయిన లబ్ధిదారులు, వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోని లబ్ధిదారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తొలగిస్తున్నది. ప్రతి నెలా 5 వేల నుంచి 6 వేల మంది పేర్లను ఆసరా పెన్షనర్ల జాబితా నుంచి తీసేస్తున్నది. 2019లోనే 1,16,534 పేర్లను ఆసరా జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. 2019 డిసెంబర్ లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 52,082 మంది పేర్లను ఒకేసారి తీసేసింది. మొత్తంగా గడిచిన మూడేండ్లలో రెండున్నర లక్షల మందిని తొలగించినట్లు తెలిసింది. 2019 జనవరి నాటికి రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పొందుతున్నవారి సంఖ్య 39.14 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 37లకు దిగింది.
ఎన్నికలుంటే శాంక్షన్
ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడనే కొత్త ఆసరా పెన్షన్లను సర్కారు మంజూరు చేస్తున్నది. హుజుర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు అక్కడి పెండింగ్ పెన్షన్ అప్లికేషన్లలో కొన్నింటిని బయటకు తీసి మంజూరు చేశారు. తాజాగా హుజూరాబాద్‌లో కూడా కొత్త పెన్షన్లు ఇచ్చారు. అక్కడ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఆపేశారు.
- Tags
- Asara