అసదుద్దీన్ ఓవైసీ ఆలోచనలు అమ్మాయిల జీవితానికే పెనుప్రమాదం..

by Shyam |
అసదుద్దీన్ ఓవైసీ ఆలోచనలు అమ్మాయిల జీవితానికే పెనుప్రమాదం..
X

దిశ, నెల్లికుదురు : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యువతుల వివాహ వయసు 18 నుంచి 21 సంవత్సరాలకు పెంపు నిర్ణయం చారిత్రాత్మకం అని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బీరవెల్లి సురేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. యువకులతో సమానంగా యువతులకు పెళ్లి వయసు పెంపు ఈరోజుల్లో అవసరం అన్నారు. ఈ నిర్ణయం అమ్మాయిలు చదువుకోవడానికి ఎంతో దోహద పడుతుందన్నారు.చదువు వలన మహిళలు మానసికంగా వికాసం పొందుతారని, వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు తోడ్పాడునందిస్తని పేర్కొన్నారు.

21 ఏళ్లకు పెళ్లి జరిగితే పుట్టబోయే సంతానం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాలతో స్వయం సమృద్ధి సాధిస్తారన్నారు. అయితే, ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ లాంటి మత ఛాందసవాదులు కావాలనే స్త్రీల వివాహ వయసు పెంపును వ్యతిరేకిస్తున్నారని ఇది ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. స్త్రీలు స్వయం సమృద్ధి సాధించడం ఇష్టంలేని వారు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారని విమర్శించారు. త్రిపుల్ తలాక్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన సమయంలో ముస్లిం మహిళలు ఎంతో ఆనందిస్తే, ఓవైసీ వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఓటుకు వివాహ వయసుకు ముడిపెట్టి మాట్లాడటం అవివేకం అన్నారు. ఇప్పటికైనా మంచిని మంచి అనే చెప్పే అలవాటును అలవర్చుకోవాలని సూచించారు.

Advertisement

Next Story