- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజాసింగ్ అరెస్ట్‌తో మా పెద్ద డిమాండ్ నెరవేరింది: Asaduddin Owaisi
దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఓ వర్గం వారు ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి.. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో చార్మినార్, పాతబస్తీ ఏరియాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. రంగంలోకి దిగిన పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అయితే, దీనిపై స్పందించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.. శుక్రవారం రోజు ప్రార్ధనలకు ముందు హైదరాబాద్‌లో శాంతి వాతావరణం నెలకొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహ్మద్ ప్రవక్త మీద వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి, సస్పెండ్ చేయాలనే తమ అతిపెద్ద డిమాండ్ నెరవేరిందన్నారు. శుక్రవారం ప్రార్ధనల అనంతరం దేశ సామరస్యానికి విఘాతం కలింగించే ఎలాంటి నినాదాలు చేయవద్దని ప్రజలను కోరారు. గత రెండు, మూడు రోజులుగా నిరసనలతో అట్టుడిపోతున్న హైదరాబాద్ నగరంలో శాంతి పూర్వక వాతారణం నెలకొనాలని అన్నారు.
కాగా, మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ వ్యాఖ్యలకు 10రోజుల్లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. రాజాసింగ్‌పై గతంలో నమోదైన కేసుల్లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు.