- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆస్ట్రిచ్ ఎగ్‌పై అద్భుత కళాకృతి..
దిశ, ఫీచర్స్ : పెయింటింగ్ అనేది ఓ కళ అయితే, అందమైన కళాకృతిని ఆస్ట్రిచ్ గుడ్డు మీద వేయడం.. ఇంకాస్త ప్రత్యేకమైన కళ. ఇప్పటికే ఎంతోమంది క్రియేటివ్ ఆర్టిస్టులు గుడ్డు పెంకుల మీద అత్యద్భుత పెయింటింగ్స్ వేసి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. కానీ వియత్నాంకు చెందిన ఆర్టిస్ట్ ‘నుయెన్ హంగ్ కుయాంగ్’ మాత్రం హ్యుమన్ హెయిర్ కంటే అతిసన్నటి, సూక్ష్మ రంధ్రాలు చేసి ఆస్ట్రిచ్ ఎగ్‌పై ఓ కళాఖండాన్ని సృష్టించాడు. ఈ క్రమంలో కుయాంగ్.. ప్రపంచంలోనే మోస్ట్ ఇంప్రెసివ్ ఎగ్ కార్వింగ్ చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోగా, ఆ రికార్డ్ సెట్టింగ్ ఎగ్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
వియత్నాంలోని హానోయికి చెందిన ఆర్టిస్ట్ కుయాంగ్.. దశాబ్ద కాలం నుంచి ‘చికెన్ ఎగ్స్’పై ఆకట్టుకునే కళాకృతులను తీర్చిదిద్దుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆస్ట్రిచ్ ఎగ్‌పై అతడు మలిచిన ఆర్ట్ మాత్రం ఎప్పటికీ ది బెస్ట్ అనిపించుకుంటోంది. ఇందుకోసం మూడు సంవత్సరాల పాటు శ్రమించిన కుయాంగ్, ఆ గుడ్డుపై 0.2 మిమీ నుంచి 3 మిమీ వ్యాసంతో కూడిన 45,863 సూక్ష్మ రంధ్రాలు చేశాడు. ఎగ్‌పై డ్రిల్ చేసిన ఆ రంధ్రాలను హై రిజల్యూషన్ స్కానింగ్ చేసి కంప్యూటర్ సాయంతో లెక్కించారు.
‘కోడి గుడ్డు షెల్‌పై రంధ్రాలు చేయడం అంత తేలికేం కాదు, చాలా శ్రమతో పాటు ఎంతో ఓపిక అవసరం. అయితే ఆస్ట్రిచ్ ఎగ్‌పై డ్రిల్ చేయడం మరింత కఠినం. దానిపై క్రమపద్ధతిలో రంధ్రాలు చేయాలంటే డ్రిల్‌పై నియంత్రణను కలిగి ఉండటంతో పాటు, చేస్తున్న పని మీద ధ్యాస ఉండాలి. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం మూడేళ్లు తీసుకున్నాను. చివరి డ్రిల్ వరకు కూడా ఎంతో ప్రశాంతమైన హృదయంతో, ఓపికతో చేశాను. చివరగా అనుకున్నది సాధించాను. ఇక ఈ ఆర్ట్ వేయడానికి టర్కిష్ ఆర్టిస్ట్ మిస్టర్ హమిత్ హేరన్ స్ఫూర్తిగా నిలిచాడు. టర్కీకి అతడు గిన్నిస్ రికార్డ్ అందించగా, అతడిలా వియత్నాం దేశానికి కూడా ఎగ్ కార్వింగ్‌లో ఓ గిన్నిస్ రికార్డు అందించాలని నేను కోరుకున్నాను’ అని కుయాంగ్ తెలిపాడు. హేరన్ కూడా ఎగ్ కార్వింగ్ ఆర్టిస్ట్ కాగా, చికెన్ ఎగ్‌పై 12వేల రంధ్రాలు డ్రిల్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు.
కుయాంగ్ సృష్టించిన కళాకృతిని ‘వియత్నాం రికార్డ్ ఆర్గనైజేషన్’ ఇటీవలే గుర్తించింది. ప్రస్తుతం కుయాంగ్ దీన్ని గిన్నిస్ రికార్డ్స్‌కు సమర్పించే పనిలో ఉన్నాడు. ఎగ్‌పై అతి ఎక్కువ రంధ్రాలు డ్రిల్ చేసిన కళాకృతిగా దీనికి గిన్నిస్ రికార్డు గుర్తింపు వస్తుందని అతడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.