- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి ముఠా సభ్యుడి అరెస్ట్
దిశ, క్రైమ్ బ్యూరో: మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు గుర్తించారు. భాస్కర్, అతని సహచరుడు కేతవత్ ప్రకాష్ హయాత్‌నగర్‌లో మై కార్ రెంటల్ సర్వీస్ ను నిర్వహిస్తున్నారు. రోజుకు రూ.3 వేలకు కార్లను అద్దెకు ఇచ్చేవారు. వ్యాపారంలో భాగంగా ఫంక్షన్లకు హాజరుకావాలనే కారణంతో సూర్యాపేటకు చెందిన రమావత్ పాండు వీరి వద్ద తరుచూ కారును అద్దెకు తీసుకునేవాడు.
కొద్ది రోజుల తర్వాత.. గంజాయిని తక్కువకు కొనుగోలు చేసి, మహారాష్ట్ర, హైదరాబాద్ లలో అధిక ధరకు సరఫరా చేస్తూ లాభాలు పొందవచ్చంటూ భాస్కర్, అతని స్నేహితుడికి ప్రతిపాదన చేశాడు. అప్పట్నుంచి వీరు స్నేహితులయ్యారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి గంజాయిని రహస్యంగా అక్రమంగా తరలిస్తూ మహారాష్ట్ర, హైదరాబాద్ లలో వ్యాపారం చేయడం ప్రారంభించారు. విశాఖపట్నం నుంచి కిలో గంజాయి మాదక ద్రవ్యాలను కిలో రూ.3 వేలకు కొనుగోలు చేసి, మహారాష్ట్రకు చెందిన కరణ్ పార్కలే కు కిలో రూ.8 వేలకు విక్రయించే వారు. హైదరాబాద్ లోనూ అనేక మంది వినియోగదారులకు సరఫరా చేసేవారు.
సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు దాడి చేసి భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. భాస్కర్ నుంచి 100 కిలోల గంజాయి, రూ.30 వేల నగదు, మహింద్రా ఎక్స్ యూవీ కారు, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లలో గంజాయి స్మగ్లింగ్ కేసులు రెండు నమోదైనట్టు గుర్తించారు. దీంతో భాస్కర్ పై పీడీ చట్టాన్ని ప్రయోగించి, చర్లపల్లి జైలుకు తరలించినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు.