కామారెడ్డిలో కేటీఆర్ సభ.. సమావేశానికి ఏర్పాట్లు ముమ్మరం..

by Shyam |   ( Updated:2021-11-08 08:30:35.0  )
KTR1
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో నేడు రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా బీబీపేట మండల కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ ప్రముఖ కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంతంగా 6 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఈడీ కళాశాల ఆవరణలో సుమారు 2 వేల మందితో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

వచ్చిన కార్యకర్తలకు సరస్వతి శిశుమందిర్ ప్రాంగణంలో భోజన వసతి కల్పిస్తున్నారు. కార్యకర్తల సమావేశం ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరిశీలించారు. బీబీపేట, కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలు సజావుగా సాగేలా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు .

Advertisement

Next Story