- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపే కాంగ్రెస్ సభ.. 15 ఎకరాల్లో 3 వేదికలతో భారీ ఏర్పాట్లు..
దిశ ప్రతినిధి, రంగారెడ్డి : దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ మహేశ్వరం మండలం రావిర్యాలలోని వండర్లా వద్ద రేపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ సభలతో దళితులను, గిరిజనులను చైతన్యం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.
ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాల మధ్య ఉండే రావిర్యాల గ్రామంలో బుధవారం జరిగే భారీ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని 15 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించనున్నారు. ఈ సభ ప్రాంగంణంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగించే వేదికపై 200 మంది కూర్చునేలా ఒక వేదిక, జిల్లా, రాష్ట్ర స్ధాయి నాయకులు కూర్చునేందుకు మరో వేదిక, కళాకారుల కోసం ఒక వేదికలను ఏర్పాటు చేశారు.
ఈ వేదికలకు ఇరువైపుల అంబేద్కర్, కొమరంభీమ్, దొడ్డి కొమరయ్యల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ సభ ప్రాంగంణంలోకి వచ్చే కార్యకర్తల కోసం 15 ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణానికి వచ్చే కార్యకర్తల వాహనాలు నిలిపేందుకు బోంగ్లూర్ గేట్ నుంచి తుక్కుగూడ వరకు సుమారు 100 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు.
ఈ ఆత్మగౌరవ సభకు సుమారుగా లక్ష50వేల మంది కార్యకర్తలు హాజరుకానున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభం తెచ్చేందుకు ఈ వేదికను వాడుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు అధిష్టానం ఆదేశించింది. ఈ సభకు జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి టీం ఇప్పటికే రంగంలోకి దిగి సభకు తరలివచ్చే జనాల గురించి ఆరా తీస్తున్నారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క, పటేల్ రమేశ్ రెడ్డి, వేంనరేందర్ రెడ్డి, విజయరమణారావులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నర్సింహ్మారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, చిలుక మధుసూధన్ రెడ్డిలతో పాటు ముఖ్య నాయకులు ఏర్పాట్లుపై పూర్తి స్ధాయిలో దృష్టి సారించారు.
ఈ సభకు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహాబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు. సుమారుగా లక్ష మందికి తగ్గకుండా జనాలను తరలించేందుకు జిల్లా, రాష్ట్ర, నియోజకవర్గ స్ధాయి నేతలు నిమగ్నమయ్యారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని నేతలు పిలపునిస్తున్నారు.
ఈ సభలో దళిత, గిరిజన నేతలకు అత్యధిక ప్రాధాన్యం దక్కే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నెల 9వ తేదీన ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి కేంద్రంగా దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సభ కూడా విజయవంతం కావాలని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు కృషి చేస్తున్నారు.