- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సలాం సైనికా.. ఎముకలు గడ్డకట్టే చలిలో గర్భిణీకి సాయం
దిశ, వెబ్‌డెస్క్: మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసే సైనికులు.. దేశ ప్రజలకు ఆపదొచ్చినా ప్రతీసారి మేమున్నామంటూ ముందుకొస్తారు. ఎన్నో విపత్తుల్లో వారు దేశ ప్రజలకు అందించిన సేవలు వెలకట్టలేనివి. తాజా విషయానికొస్తే.. మోకాళ్లలోతు మంచులో ఓ నిండు గర్భిణిని మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించిన భారత జవాన్లు, మరోసారి తమ సేవానిరతిని చాటుకోగా.. ఆ తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాగా సైనికులు చేసిన ఈ పనికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
జమ్ముకశ్మీర్, కుప్వారాలోని ఫకియాన్ గ్రామానికి చెందిన మంజూర్ అహ్మద్ షేక్ భార్య నిండు గర్భవతిగా ఉండగా, ఈ నెల 5వ తేదీన అర్ధరాత్రిపూట ఆమెకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. తీవ్రమైన చలితో పాటు మంచు కురుస్తుండటంతో బయట వాహనాలు కూడా ఎక్కువగా తిరగడం లేదు. పైగా అర్ధరాత్రి కావడంతో అహ్మద్‌కు ఏం చేయాలో తెలియలేదు. భార్య పరిస్థితి చూడలేక, దగ్గర్లోని ఆర్మీ అధికారులతో తన బాధను మొరపెట్టుకోగా, చలించిపోయిన ఆర్మీ జవాన్లు.. వైద్యబృందంతో అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రసవ వేదన ఎక్కువ కావడంతో.. సైనికులు ఆమెను భుజాలపై మోస్తూ, మోకాళ్ల లోతు మంచులో రెండు కిలోమీటర్లు పైగా నడిచి కరాల్‌పురాలో ఉన్న ఆస్పత్రికి చేర్చారు. అనంతరం ఆమె మగ బిడ్డకు జన్మనివ్వగా, ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. వైరల్‌గా మారింది. ‘హ్యాట్సాఫ్ సైనికా.. మీ సేవ, త్యాగాలు అనిర్వచనీయమైనవి, మీరు ఆల్వేస్ రియల్ హీరోస్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.