- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీ వెళ్తున్న ఆర్మీ జవాన్ అరెస్ట్.. ఏమైందంటే?

X
దిశ, వెబ్ డెస్క్: ఆర్మీ జవాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. పాట్నా విమానాశ్రయంలో పఠాన్ కోట్ వెళ్తున్న సీఐఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ ను అధికారులు తనిఖీ చేశారు. అనంతరం అతడి బ్యాగ్ ను కూడా తనిఖీ చేశారు. ఆ సమయంలో చెకింగ్ మెషిన్ శబ్ధం చేసింది. వెంటనే అలర్ట్ అయిన ఎయిర్ పోర్ట్ అధికారులు అతడి బ్యాగ్ లో ఏముందో అని చెక్ చేశారు. ఆ సమయంలో అతడి బ్యాగ్ లో కొన్ని బుల్లెట్లు ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని జైలుకు పంపారు. అయితే, అరెస్ట్ అయిన ఆర్మీ జవాన్ పేరు బాబీ కుమార్ అని, ప్రస్తుతం అతను పఠాన్ కోట్ లో విధులు నిర్వర్తిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Next Story