పాక్, చైనాలు జట్టుకట్టి దాడి చేసే ముప్పు : నరవణే

by Shamantha N |
పాక్, చైనాలు జట్టుకట్టి దాడి చేసే ముప్పు : నరవణే
X

న్యూఢిల్లీ : దాయాది దేశం పాకిస్తాన్, చైనాల మధ్య సైనికపరమైన సమన్వయం పెరిగిందని, ఇవి రెండు జట్టుకట్టి దాడి చేసే ముప్పును కొట్టిపారేయలేమని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె హెచ్చరించారు. అందుకే రెండు సమస్యలను ఒకే సారి డీల్ చేసే వ్యూహం అవసరమని అభిప్రాయపడ్డారు.

సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి ఆకస్మిక ఘటనలు చోటుచేసుకున్నా ఎదుర్కోవడానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉన్నదని వివరించారు. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తొలగించడంపై త్వరలోనే ఏకాభిప్రాయం ఏర్పడుతుందని ఆశాభావం ప్రకటించారు. పాకిస్తాన్ ఇప్పటికీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, భారత్ ఈ సమస్యనూ ఇప్పటికీ ప్రభావవంతంగా ఎదుర్కొంటూనే ఉన్నదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed