ఆర్చర్ జ్యోతి సురేఖ సరికొత్త రికార్డు

by Shiva |
ఆర్చర్ జ్యోతి సురేఖ సరికొత్త రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తాను నెలకొల్పిన జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టింది. రాబోయే ఏప్రిల్‌లో ఆర్చరీ వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సెలెక్షన్లు సోనేపట్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఈ ఎంపిక ప్రక్రియలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు తరపున వెన్నం జ్యోతి సురేఖ పాల్గొన్నది. ట్రయల్స్‌లో ఏకంగా 720కి గాను 710 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించింది. గత ఏడాది సురేఖ 720కి గాను 709 పాయింట్లు సాధించి రికార్డు నెలకొల్పింది. అదే రికార్డును తాజాగా సవరించింది. ఇండియాకు చెందిన టాప్ 8 మంది ఆర్చర్లతో రౌండ్ రాబిన్ పద్దతిలో నిర్వహించిన మ్యాచ్‌లలో సురేఖ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. సురేఖ స్వస్థలం ఏపీలోని విజయవాడ కావడం విశేషం.

Advertisement

Next Story