కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల పాలిట శాపంగా మారింది..

by srinivas |
congress
X

దిశ, ఏపీ బ్యూరో: దేశంలో పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచుతున్న ధరలకు వ్యతిరేకంగా అమేథీలో శనివారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిర్వహించిన జన జాగరణ్ పాదయాత్రకు సంఘీభావంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల కేంద్రంలో పీసీసీ చీఫ్ శైలజనాథ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేలా నిరసన ప్రదర్శన చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను తగ్గించాలని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా డీసీసీ అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాపరెడ్డి, రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు దాదా గాంధీ, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story