ప్రాణహాని ఉంది.. డీజీపీకి నిమ్మగడ్డ లేఖ

by srinivas |   ( Updated:2021-01-23 08:07:27.0  )
nimmagadda
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఆయన ఈ లేఖను రాశారు. వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఎస్ఈసీ కోరారు. ప్రాణహాని కలిగిస్తానంటూ వెంకట్రామిరెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారని ఎస్ఈసీ తెలిపారు. వెంకట్రామిరెడ్డి తనపై భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిమ్మగడ్డ చెప్పారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని డీజీపీని ఎస్ఈసీ లేఖలో కోరారు.

కాగా ప్రాణాపాయం వస్తే ఎదుటి వారి ప్రాణాలను తీసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని నిమ్మగడ్డ రమేశ్ ఆరోపించారు.

Advertisement

Next Story