వంగపండు కుటుంబ సభ్యులకు మంత్రుల పరామర్శ

by srinivas |
వంగపండు కుటుంబ సభ్యులకు మంత్రుల పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజా గాయకుడు వంగపండు ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో విజయనగరంలోని ఆయన కుటుంబ సభ్యులను మంత్రులు పరామర్శించారు. ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, పేర్నినాని, కొడాలి నాని వంగపండు చిత్రపటానికి నివాళులర్పించారు.

సీఎం తరుపున వారు సంతాపం తెలిపారు. ఎల్లవేళలా వంగపండు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వంగపండు మనమధ్య లేనప్పటికీ ఆయన పాటలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని మంత్రులు అన్నారు.

Advertisement

Next Story