రాష్ట్రంలో 86 కంపెనీలను గుర్తించాం: గౌతమ్ రెడ్డి

by srinivas |
రాష్ట్రంలో 86 కంపెనీలను గుర్తించాం: గౌతమ్ రెడ్డి
X

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో చోటుచేసుకున్న ఘటన కొత్త పాఠాలు నేర్పిస్తోంది. దుర్ఘటన నేపథ్యంలో నేటి మధ్యాహ్నం వైజాగ్ చేరుకున్న పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించారు. అనంతరం దుర్ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అక్కడ ఆ కంపెనీ ప్రతినిధులతో పాటు సహాయక చర్యలు చేపడుతున్న నిపుణులతో గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదానికి గురైన ట్యాంక్, ఇతర ట్యాంకుల పరిస్థితిపై సమీక్షించామని చెప్పారు. స్టిరీన్ వాయువు గాల్లో తక్కువ మోతాదులోనే ఉందని ఆయన చెప్పారు. అందువల్ల భయపడాల్సిన అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. మరో 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆయన అన్నారు. స్టిరీన్ వాయువు భారస్థితిలో ఉంటుందని, ఎక్కువ శాతం గాల్లో ఉండదని, త్వరగానే కిందకు వచ్చేస్తుందని ఆయన చెప్పారు.

విశాఖలో చోటుచేసుకున్న ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదకర రసాయనాలుండే మరో 86 కంపెనీలను గుర్తించామని గౌతమ్ రెడ్డి చెప్పారు. ఈ కంపెనీలన్నింటిలో భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తామని ఆయన ప్రకటించారు. ఆ తరువాతే లాక్‌డౌన్ తరువాత పనులు ప్రారంభించేందుకు అనుమతులు ఇస్తామని ఆయన స్ఫష్టం చేశారు.

tags: ap, industries department, goutham reddy, vizag, lg polymers

Advertisement

Next Story