లోకేశ్! నీ రంకెలకు ఎవరూ భయపడిపోరు : మంత్రి బాలినేని

by srinivas |
Balineni Srinivas Reddy
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్ అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. విశాఖ ఏజెన్సీలో లేటరైట్ త‌వ్వకాల‌కు టీడీపీ ప్రభుత్వమే అనుమ‌తులు ఇచ్చింద‌ని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లేటరైట్.. ఇవాళ బాక్సైట్ అయ్యిందా? అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం లేటరైట్ తవ్వకాలకు అనుమతులు కొత్తగా ఇవ్వలేదన్నారు. అంతేకాదు బాక్సైట్ తవ్వకాలను పూర్తిగా రద్దు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు.

బినామీల పేరుతో లక్షల కోట్లు ఆర్జించిన లోకేశ్ నేడు రంకెలు వేయడం సిగ్గుచేటని విమర్శించారు. లోకేశ్ రంకెలకు భయపడేవారెవరూ లేరన్నారు. టీడీపీ ప్రభుత్వంలో లేటరైట్‌ను వ్యతిరేకించిన గిరిజనులపై అక్రమ కేసులు, హత్యాహత్నం చేయించింది మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన అనుచర వర్గం కాదా అని నిలదీశారు. అయ్యన్న బినామీ తవ్వకాలపై వైసీపీ ప్రభుత్వం ఫైన్ వేసింది వాస్తవం కాదా అనేది లోకేశ్ తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed