దమ్ముంటే మరో పార్టీ పెట్టి పోటీకి రండి : అనిల్

by srinivas |
దమ్ముంటే మరో పార్టీ పెట్టి పోటీకి రండి : అనిల్
X

టీడీపీ అధినేత చంద్రబాబుకు దమ్ముంటే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని వదిలేసి.. మరో పార్టీ పెట్టి పోటీకి రండి అంటూ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ సవాల్ విసిరారు. ఎన్టీఆర్‌ మీద ఉన్న అభిమానంతో ఓట్లు పడుతున్నాయి తప్ప చంద్రబాబును చూసి కాదని విమర్శించారు. చంద్రబాబు వెంట ఉన్నది ఎన్టీఆర్ అభిమానులని తెలిపారు. తాము మంత్రి కంటే ముందు సీఎం జగన్ భక్తులమని చెప్పారు. జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అయిపోతాడని అనిల్ హెచ్చరించారు.

Advertisement

Next Story