- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అప్పుడు చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారు’
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి ఆళ్లనాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం నాని మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌తో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే చంద్రబాబు నియోజకవర్గ ప్రజలను, పార్టీ నేతలను గాలికొదిలేసి హైదరాబాద్ పారిపోయారని మండిపడ్డారు. కరోనా కాలం మొత్తం హైదరాబాద్‌లో కూర్చుని టైమ్‌పాస్ చేశారని ఎద్దేవా చేశారు. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం అయిందంటూ చంద్రబాబు దీక్ష చేసి సాధించిందేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో రాష్ట్ర విఫలం అ యిందని చంద్రబాబు అనడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అన్నారు. కరోనా నివారణ చర్యలపై ప్రధాని ప్రశంసిస్తే చంద్రబాబుకు కనబడట్లేదా? అని అడిగారు. ఒక సీఎం పట్ల చులకనగా మాట్లాడటం చంద్రబాబుకు సంస్కారం అనిపించుకోదు అని తెలిపారు. కరోనా కట్టడికి పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ వాడాలని ఐసీఎమ్‌ఆర్ సూచించిన విషయం తెలుసుకునే జ్ఞానం కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు.