ఏపీ మండలి చైర్మన్‌కు కరోనా..

by Anukaran |
ఏపీ మండలి చైర్మన్‌కు కరోనా..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అక్కడ సామాన్యులతో పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.

తాజాగా మండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తాజాగా చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, షరీఫ్‌ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు ఆకాంక్షించారు.

Advertisement

Next Story