సీఎం జగన్ కు షాక్.. పంచాయతీ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

by srinivas |   ( Updated:2021-01-21 00:15:12.0  )
సీఎం జగన్ కు షాక్.. పంచాయతీ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సీఎం జగన్ కు షాకిస్తూ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సింగిల్ జడ్జి తీర్పును హైకోర్ట్ కొట్టివేసింది. రాష్ట్రఎన్నికల సంఘం అప్పీల్ పై హైకోర్ట్ లో వాదనలు ముగిశాయి. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా ఎన్నికల్ని వాయిదా వేయడంపై ఎస్ఈసీ కోర్ట్ రిట్ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఎస్ఈసీ తరుపు న్యాయవాది ఆదినారాయణరావు.. వ్యాక్సినేషన్ కు ఎన్నికలు అడ్డుకాదని వాదనలు వినిపించారు. ఇరు పక్ష వాదనల్ని విన్న హైకోర్ట్ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు నిర్వహించాలని తీర్పిచ్చింది. ఈ తీర్పుతో త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.మరోవైపు హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించనుంది. రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఇవ్వాళ, లేదంటే రేపు రాష్ట్రప్రభుత్వం ఎన్నికల్ని వాయిదా వేసేలా సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేయనుంది.

కాగా, జనవరి 8న ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి మొత్తం నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి నోటిఫికేషన్ల విడుదల చేయాలని నిర్ణయింంచింది.

Advertisement

Next Story