- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాఠశాల స్థలాల్లో ఆ నిర్మానాలు వద్దు : హైకోర్టు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ/ వార్డు సచివాలయాల నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణలలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్బీకేలు, సచివాలయాలు నిర్మిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏడుగురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్, చినవీరభద్రుడు, బి.రాజశేఖర్,శ్యామలరావుతో మరో ఇద్దరు అధికారులు విచారణకు హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,160 గ్రామ/ వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మించినట్లు కోర్టుకు తెలియజేశారు. అయితే వాటిలో 450 పైగా నిర్మాణాలను వేరోచోటుకు తరలించినట్లు అధికారులు ధర్మాసనానికి వివరించారు. మిగిలిన నిర్మాణాలను 4వారాల్లో తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ ఒకటికి వాయిదా వేసింది.