- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై కేసులు కొట్టివేత
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ పెట్టిన కేసులను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొందరు రాజధానిలో భూములు ముందుగానే కొనుగోలు చేశారని సీఐడీ కేసులు నమోదు చేసింది. రాజధానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసింది. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ప్రభుత్వం కక్ష సాధిస్తోందని పేర్కొంటూ కిలారు రాజేష్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని పేర్కొంది. దీనికి ఐపీసీ సెక్షన్లకు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది.
Advertisement
Next Story