- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన: మంత్రి కన్నబాబు
దిశ, ఏపీ బ్యూరో: రాబోయే మార్చి నాటికి రాష్టంలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్కో ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్ నిర్మాణాలను ప్రారంభించాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంత్రి కన్నబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖేశ్ కుమార్ మీనాకు మంత్రి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారని.. అందులో ఆహార శుద్ధి పరిశ్రమ ఒకటని చెప్పుకొచ్చారు. ఫుడ్ ప్రాసెస్సింగ్ పరిశ్రమ అభివృద్ధికి సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆహార శుద్ది యూనిట్ల నిర్మాణానికి మార్చినాటికి పనులు ప్రారంభించి అక్కడ నుంచి ఏడాది లోపు నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. స్థల సేకరణలో ఎటువంటి ఇబ్బందులున్న సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.
అయా జిల్లాలలో పండే పంటల ఆధారంగా ఏ జిల్లాలో ఎటువంటి పరిశ్రమ రావాలన్న దానిపై కూడా కార్యచరణ చేయాలన్నారు. పెద్ద ఎత్తున ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, నిరుద్యోగులకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం సమర్ధవంతంగా అమలు చేస్తూ సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు మంత్రి కన్నబాబు సూచించారు.