- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళనాడు బాటలో ఏపీ
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెంబర్ వన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కోవిడ్ బాధితులకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కూడా అందిస్తోంది. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేస్తోంది. అయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. సామాజిక వ్యాప్తి లేదంటున్నప్పటికీ గత వారం రోజులుగా ఏపీలో నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన రేపుతున్నాయి.
మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. దీంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఏమాత్రం అనారోగ్యం వచ్చినా.. కరోనాయేమోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. కరోనా పేషంట్లపై చూపుతున్న సామాజిక వివక్ష కారణంగా.. కరోనా బాధితులు బయటపడేందుకు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఏపీలో కరోనా టెస్టులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంతవరకు కరోనా నిర్ధారణ టెస్టులను ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ సిబ్బంది మాత్రమే నిర్వర్తించేవారు. ఇకపై కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేట్ ల్యాబ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కరోనా నిర్ధారణ పరీక్షకు తీసుకోవాల్సిన ఫీజు కూడా నిర్ధారించింది. స్వాబ్ శాంపిల్ తీయాలని ప్రభుత్వం పంపిస్తే అందుకు 2,400 రూపాయలు ఛార్జీ చేయాలని సూచించింది. అలా కాకుండా వ్యక్తిగతంగా ఎవరైనా కరోనా నిర్ధారణ టెస్ట్ చేయించుకుంటే వారికి 2,900 రూపాయలు చార్జీ చేయాలని సూచించింది.