కరోనా నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

by srinivas |
కరోనా నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. సర్కార్ అధిక మొత్తంలో టెస్టులు చేస్తున్న కొద్ది వైరస్ మరింత బయట పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ నివారణకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు థర్మా, పలాక్సీ మీటర్లను సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఏన్ఎంల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు 13 జిల్లాలకు 21, 992 పల్సాక్సీ మీటర్లు, 22,602 థర్మా మీటర్లు సరఫరా చేసింది. దీంతో ఏఎన్ఎంలు గ్రామాలు, వార్డుల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం వాటికి సంబంధించిన రిపోర్టులను వైద్యాధికారులకు ఇవ్వనున్నారు. దీంతో లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించవచ్చని ప్రభుత్వవ భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed